సముద్రంలోకి 4250 టీఎంసీలు
కృష్ణా గోదావరి నదులనుంచి గత ఏడాది సముద్రంలోకి వదిలిన నీరు 2485 టీఎంసీలు కృష్ణా గోదావరి నదులనుంచి ఈ ఏడాది ఇప్పటివరకు సముద్రంలోకి వదిలిన నీరు 4250 టీఎంసీలు కృష్ణా, గోదావరి నదుల నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదనీరు సముద్రంలోకి వెళుతోంది.
ఈ రెండు నదుల్లో ఇంకా ప్రవాహాలు అధికంగానే ఉండడంతో సముద్రంలో కలిసే నీరు మరింత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.ఎగువ రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురియడంతో కృష్ణా బేసిన్‌లోని ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వంటి అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి.
ఈ ఏడాది ఇప్పటి వరకు కృష్ణా నది నుంచి సుమారు 696 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు. అలాగే గోదావరి బేసిన్‌లోనూ వరద ప్రవాహం భారీగానే నమోదవుతోంది. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు మినహా మిగిలిన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి.