ఏపీ రాజధాని, ఇతర ప్రాజెక్టులపై ప్రజల నుంచి వినతులు నిపుణుల కమిటీ ఆహ్వానించింది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, అమలు తీరు..రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనలు ఇవ్వాలని కోరింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి రాజధాని నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులపై అధ్యాయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్.రావు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీని సెప్టెంబరు 13న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీ సోమవారం అమరావతి నిర్మాణం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై ప్రజల సూచనలను, అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ పట మటలో ఉన్న తమ కార్యాలయానికి నవంబరు 12లోపు ప్రజలు, ఇతర ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలను పంపించాలని సూచించింది.
తమ తమ అభిప్రాయాలను మెయిల్ ద్వారా గానీ, లేఖల రూపంలో పంపించవచ్చని వెల్ల డించింది. ప్రజల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ కమిటీ తన నివే దికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ తరువాత దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.