ఎన్నికల మేనిఫెస్టోను ఒక చిత్తు కాగితంగా భావించకుండా, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ వంటి పవిత్ర గ్రంధంగా ముఖ్యమంత్రి భావిస్తూ మేనిఫెస్టోకు ఎంతో గౌరవం ఇస్తున్నారని శ్రీ ఆళ్ల నాని చెప్పారు. పేద ప్రజలకు ఇంటి స్థలం పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి సీఎం ఆలోచన.. దానిని చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తూ అడ్డుకున్నారని ఆయన అన్నారు. నేను చేయలేని పనిని జగన్ చేస్తే, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు నాయుడు ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు అని ఆయన అన్నారు.