హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

ఐవీఆర్

గురువారం, 1 మే 2025 (23:16 IST)
హైదరాబాద్: ఢిల్లీ ఎన్ సిఆర్ లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, భారతదేశంలోని చిన్న మరియు సూక్ష్మ వ్యాపారాల కోసం అత్యంత వైవిధ్యమైన వర్క్‌స్పేస్ ప్రొవైడర్లలో ఒకటిగా గుర్తింపు పొందిన alt.f కోవర్కింగ్, తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తమ మొదటి కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించింది. 2025 చివరి నాటికి హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో మరో కేంద్రం ప్రారంభించటంతో సహా మరో మూడు కేంద్రాలను ప్రారంభించాలనే ప్రణాళికలను సైతం alt.f కోవర్కింగ్ రూపొందించింది.
 
56,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 1,200 సీట్లకు పైగా ఉన్న ఈ కొత్త హైదరాబాద్ కేంద్రం, పెరుగుతున్న స్టార్టప్‌లు మరియు చిన్న వ్యాపారాల అవసరాలను తీర్చే వాల్యూ -ఫస్ట్ , డిజైన్-నేతృత్వంలోని వర్క్‌స్పేస్‌లను అందించడంలో alt.f కోవర్కింగ్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో 100,000 చదరపు అడుగుల విస్తరణ సామర్థ్యం, 2,400 సీట్లతో, ఈ ప్రధాన కేంద్రం నగరం యొక్క వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థకు కేంద్రంగా మారనుంది.
 
“సౌకర్యవంతమైన పని ప్రాంగణాల పరంగా అత్యున్నత మార్కెట్లలో హైదరాబాద్ ఒకటి. జాతీయ స్థాయిలో మా కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యంకు ఒక అడుగు దగ్గరగా హైదరాబాద్‌లో మా కార్యకలాపాల ప్రారంభించటం తీసుకువస్తుంది" అని alt.f కోవర్కింగ్ సహ వ్యవస్థాపకుడు యోగేష్ అరోరా అన్నారు. “ఈ కేంద్రం కేవలం వర్క్‌స్పేస్ కాదు. విస్తరణ గురించి తీవ్రంగా ఆలోచించే వ్యవస్థాపకులకు ఒక పునాది” అని అన్నారు. 
 
నెలకు రూ. 8,000 నుండి ప్రారంభమయ్యే సీట్లతో, హైదరాబాద్ కేంద్రం ప్రైవేట్ కార్యాలయాలు, ఓపెన్ సీటింగ్, సమావేశ గదులు, వర్చువల్ ఆఫీస్ సొల్యూషన్‌లను అందిస్తుంది. ఇవన్నీ ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ మౌలిక సదుపాయాలు, జీరో క్యాపెక్స్ మోడల్ , పారదర్శక ధరల ద్వారా అందుబాటులో ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు