అమరావతి శిల్పకళ అద్భుతం... కొనియాడిన కొరియన్ శిల్పులు

శనివారం, 2 జనవరి 2016 (14:11 IST)
అమ‌రావ‌తి ప్రాంతం శిల్ప‌క‌ళా చాతుర్యం అద్భుత‌మ‌ని కొరియా దేశానికి చెందిన వాస్తుశిల్పులు హున్‌సుక్‌లీ, ఛూంగ్‌హ‌న్‌లీలు పేర్కొన్నారు. మొగ‌ల్రాజ‌పురంలోని మ‌ధుమాల‌క్ష్మీ ఛాంబ‌ర్స్‌లోని క‌ల్చ‌ర‌ల్‌ సెంట‌ర్‌ను బృందం స‌భ్యులు  సంద‌ర్శించారు. గ్యాల‌రీ విశేషాల‌ను సీసీవీ సీఈవో డాక్ట‌ర్ ఈమ‌ని శివ‌నాగిరెడ్డి వారికి వివ‌రించారు.
 
కొరియా, భార‌త‌దేశాల న‌డుమ చిత్ర‌, శిల్పక‌ళా, సాహిత్య‌, సాంస్క్ర‌తిక సంబంధ బాంధవ్యాలు వార‌ధులుగా సీసీవీ, కొరియ‌న్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేష‌న్‌లు ప‌నిచేస్తున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా కొరియ‌న్ వాస్తు శిల్పులు పేర్కొన్నారు. త‌మ దేశానికి కూడా ఏపీ వాస్తు శిల్పులు, చిత్ర‌, శిల్ప క‌ళాకారుల‌ను ఆహ్వానిస్తామ‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో మాల‌క్ష్మీ ప్రాప‌ర్టీస్ సీఈవో మండ‌వ సందీప్‌, ఆర్ట్ గ్యాల‌రీ ఇన్‌ఛార్జ్ జి.చందూ కార్తీక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి