రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్‌సేన్ స్టైలిష్ అవతార్, స్పోర్టింగ్ ట్రెండీ ఎటైర్, సన్ గ్లాసెస్ తో కనిపించారు. చొక్కాతో తన ముఖాన్ని దాచుకున్నట్లు ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. 2025 న్యూ ఇయర్ రోజున లైలా ఫస్ట్ రోజ్ (ఫస్ట్ లుక్)ని రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
లైలా విజువల్‌గా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా వుంటుంది. ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.