ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల జోరు ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో చాలా పార్టీల నాయకులు తమకు బదులుగా తమ పిల్లలను బరిలోకి దించాలని ఎదురుచూస్తున్నారు. ఇలా తమ పిల్లలను బరిలోకి దించాలనుకునే వారు తెలుగుదేశం పార్టీలోనే కాస్త ఎక్కువ ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి టీడీపీ తరపున తమ పిల్లలను బరిలోకి దించాలనుకునే అభ్యర్థులు ఎవరో చూద్దాం.
* అనంతపురం జిల్లాలో గట్టి పట్టున్న మరో ఇద్దరు నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డిని, అనంతపురం ఎంపీ స్థానంలో జేసీ దివాకర్‌రెడ్డి కొడుకు పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దించాలని చూస్తున్నారు.