కాగా, బుడమేరు ప్రాంతాల్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, ఇతర అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బుడమేరు చుట్టు పక్కల నివాస ప్రాంతాలను భవిష్యత్తులో వరదలు ముంచెత్తకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుడమేరుపై రిటైనింగ్‌వాల్ నిర్మించాలని ఆలోచిస్తోందన్నారు.
అదనపు ముంపునకు గురికాకుండా బుడమేరు కట్టల ఎత్తు పెంచాలని ఇప్పటికే జలవనరుల శాఖకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని నారాయణ ప్రస్తావించారు. నారాయణ, ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం నగరంలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు.