మార్చి మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. 6వ తేదీన వార్షిక బడ్దెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
2లేదా 3 వ తేదీ నుంచే సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉంది. 6న ఏకాదాశి రోజు వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. దీనిపై నేడో రేపో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.