కన్నా, కామర్స్ లను అభినందించిన సోము వీర్రాజు

గురువారం, 7 అక్టోబరు 2021 (16:35 IST)
బీజేపీలో లుక‌లుక‌లు ఉన్నాయ‌ని, ఏపీకి కొత్త బీజేపీ నేత‌గా తిరిగి క‌న్నాలక్ష్మీనారాయణ నియామ‌కం జ‌రుగుతుంద‌ని ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు వైసీపీకి, సీఎం జ‌గ‌న్ కి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని ఒక వ‌ర్గం అధిష్ఠానానికి లేఖ‌లు కూడా సంధించింది. అయినా, రాష్ట్ర నేత సోము వీర్రాజు మాత్రం చ‌లించ‌లేదు. త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌న్నాకు జాతీయ కార్య‌వ‌ర్గంలో చోటు అభించింది. దీనికి సోము వీర్రాజు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 
 
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణకు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. అలాగే, పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యాలయ కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమితులైన కామర్స్ బాలసుబ్రహ్మణ్యం నియామకాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు.
 
పార్టీకి సీనియ‌ర్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కామర్స్ బాలసుబ్రహ్మణ్యం నియామకాలు పార్టీ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు. పైగా, నెల్లూరు పర్యటనలో ఉన్నరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శ్రీ కన్నా, శ్రీ కామర్స్ లకు ఫోన్ చేసి మ‌రీ అభినందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు