అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి రూ. 90 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.