మొత్తం నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాల సరిహద్దుల నియంత్రణ, న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధ్యతను ఓ కమిటీకి, సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను మరో కమిటీకి అప్పగించారు.
అలాగే, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనం బాధ్యతలు మూడో కమిటీకి, సాంకేతిక సంబంధిత అధ్యయన బాధ్యతలను నాలుగో కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు అవసరమైన సాయం చేయడం కోసం కలెక్టర్ ఛైర్మన్‌గా పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.