ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో లేని ఉత్సాహం.. కేవలం ముఖ్యమంత్రి విషయంలోనే ఎందుకొచ్చిందని సూటిగా ప్రశ్నించింది. గౌరవ ప్రతిష్ఠలు ఒక్క ముఖ్యమంత్రికే కాదని, అవి ప్రతి ఒక్కరికీ ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చురకలు అంటించింది.
ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడైనా సరే.. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, ఏపీ పోలీసులకు మాత్రం ఈ విషయం తెలిసినట్టు లేదని పేర్కొంది. ముఖ్యమంత్రి అయినా సరే చట్టం కంటే ఎక్కువ కాదని స్పష్టం చేసింది.
పట్టాభి అరెస్టు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్టు విషయంలో పరస్పర విరుద్ధమైన, పొంతనలేని వివరాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం ఆత్మహత్యా సదృశం కాదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.