మరోవైపు, జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. ఈ హింస చెలరేగిన తర్వాత అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో క్రమంగా పునరుద్ధరిస్తున్నారు.
ఇందులోభాగంగా, మంగళవారం సఖినేటిపల్లి మల్కిపురం, ఆత్రేయపురం, ఐ పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పోలీసులు పునరుద్ధరించారు. జిల్లాలోని మరో 12 మండలాల్లో ఇంటర్నెట్ సేవల రద్దును మరో 24 గంటల పొడగించారు.