నవంబర్ చివరి నాటికి 100 సేవలు అందుబాటులోకి వస్తాయని, మరో 90 రోజుల్లో విద్యార్థులు క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్‌ల ద్వారా పత్రాలను పొందవచ్చని ఐటీ మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన పనిని వేగంగా చేస్తున్నామని చెప్పారు. డిజిటల్ ఆమోదం ఉన్న పత్రాలను భౌతికంగా సమర్పించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
ఇదిలావుండగా, డేటా ఇంటిగ్రేషన్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి నవజాత శిశువుకు ఆధార్ కార్డులు జారీ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని వారు ఎవరూ ఉండరాదన్నారు.