సోషల్ మీడియాలో నాయకులపై వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలంతో పాటు వారి పిల్లలను సైతం అసభ్య పదజాలంతో మనోవేదనకు గురిచేస్తున్న సోషల్ మీడియా ఉన్మాదుల భరతం పడుతున్నారు పోలీసులు. హోంమంత్రి అనిత ఆదేశంతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆయా వ్యక్తులను, నాయకులను హింసిస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. గత 48 గంటలలో 101 మంది సోషల్ మీడియా ఉన్మాదులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా వైసిపి నుంచి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టేవారిలో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా ఆ పార్టీ నుంచి వేలల్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా వున్నట్లు సమాచారం. మరోవైపు ఏ పార్టీకి చెందినవారైనా సోషల్ మీడియాలో పాలనపరంగా ఏమైనా పొరపాట్లు వుంటే వాటిపై బాధ్యతాయుతమైన, అర్థవంతమైన విమర్శలు మాత్రమే చేయాలనీ, వ్యక్తిగత దూషణలు చేయవద్దని ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పపన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే.