జగన్ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి, నేడు అదే పాదయాత్ర చేసే రైతులకు పోలీసుల రక్షణ ఇవ్వాల్సింది పోయి... రాళ్ళ దాడి జరగొచ్చు అని వైసీపీ నేతలు హెచ్చరించడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన చేసే నైతిక హక్కు కోల్పోయిందన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడడానికే కాని, రాళ్ల దాడి కుట్రలు చేసే వారి కోసం కాదని తెలిపారు. న్యాయ స్థానం అనుమతితో " న్యాయస్థానం టూ దేవస్థానం" ఇక భద్రత, బాధ్యత పోలీసులదే అని లంకా దినకర్ పేర్కొన్నారు.