గల్ఫ్ లో వుద్యోగం కోసం వెళ్లిన గిరిజ అక్కడ రెడ్డెయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది ఇలా నడుస్తూ వుండగానే తన తల్లి వద్ద పెరుగుతున్న బాలిక ఇటీవలే 9వ తరగతిలో చేరింది. ఆ సందర్భంగా ఆమె తన ఫోటోలను తల్లికి పంపింది. వాటిని చూసిన రెడ్డెయ్య కన్ను ఆమెపై పడింది. మెల్లిగా తన మనసులోని కోర్కెను గిరిజతో చెప్పాడు. నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేస్తే రూ. 10 లక్షలు ఇస్తానంటూ ఆశ చూపాడు. దానికి గిరిజ సేరనంది. వెంటనే గల్ఫ్ నుంచి ఇద్దరూ ఇండియాలో వాలిపోయి కడపలో తన కుమార్తె వద్దకు వెళ్లారు.
రెడ్డయ్యను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది గిరిజ. బాలిక ససేమిరా అని మొండికేసింది. దాంతో గిరిజ కుమార్తెను చిత్రహింసలకు గురి చేసి రెడ్డెయ్యతో వివాహం జరిపించేసింది. ఈ విషయం పొరుగున వున్నవారికి తెలియడంతో సమాచారాన్ని పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గిరిజతోపాటు రెడ్డెయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.