ప్రతిరోజూ దొండ ఆకుల రసాన్ని తీసుకుంటే?

శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:07 IST)
చాలామంది దొండకాయలను తినటానికి ఇష్టపడరు. కానీ నిజానికి వీటిని తీసుకోవడం వలన కలిగే లాభాలను తెలుసుకుంటే వీటిని అస్సలు విడిచిపెట్టరు. దొండకాయలతోనే కాదు వాటి ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
దొండకాయ ఆకులు లేదా ఈ ఆకుల రసాన్ని 30 గ్రాముల మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వలన మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది. దొండకాయ ఆకులను, నల్ల ఉమ్మెత్త ఆకులను, చిక్కుడు ఆకులను సమానంగా తీసుకుని వాటిని దంచి ఆ రసాన్ని అరికాళ్లకు రాసుకోవాలి. ఇలా చేయడం వలన అరికాళ్లలో వచ్చే మంటలు నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
దొండాకాయ ఆకుల రసంలో ఆవాల పొడి, వెల్లుల్లి రసం ఈ మూడింటిని కలుపుకుని ఉండలా చేసుకోవాలి. ప్రతిరోజూ ఈ ఉండలను నీటిలో కలుపుకుని తీసుకోవడం వలన మహిళలకు రుతు  సమయంలో వచ్చే నొప్పుల నుండి విముక్తి కలుగుతుంది. ఈ దొండ ఆకుల రసంలో గేదె పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కామెర్లు తగ్గుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు