భార్యాభర్తల అనుబంధం, కుటుంబ విలువలు మెరుగుపడాలనే ఉద్దేశంతోనే ఆయనను కేబినేట్‌లోకి తీసుకున్నామన్నారు. ప్రపంచ దేశాల్లో భారత దేశపు కుటుంబ వ్యవస్థ చాలా పవర్ ఫుల్. వేరే ఏ దేశాల్లో ఈ వ్యవస్థ లేదు. ఆ కుటుంబ వ్యవస్థే పెద్దలకు విలువలను నేర్పుతుంది. ఆ విలువలే వారసత్వంగా వస్తాయి. మ్యారేజ్ ఇన్ హెవెన్ అనే నమ్మే దేశం భారత దేశం. అందుకే ఇతర దేశాలత పోల్చుకుంటే విడాకులు ఇక్కడ ఎక్కువగా వుండవన్నారు చంద్రబాబు.
భార్యాభర్తలు కలిసే వుండాలనే సంస్కారాన్ని నేర్పింది భారత దేశమేనని చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితి దిగజారుతుంది. విడాకులు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో లెక్కలేని తనం పెరిగిపోతుంది. అందుకే విలువలను కాపాడాలనే ఉద్దేశంతో చాగంటి కోటేశ్వరరావుని స్టూడెంట్స్ ఎథిక్స్‌ను ప్రమోట్ చేయడానికి నియమించడం జరిగింది. ఈ మేరకు ఆయన గవర్నమెంట్ అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టారు.