పీఆర్సీపై సమావేశం.. త్వరలో సీఎం ప్రకటన

గురువారం, 9 డిశెంబరు 2021 (20:06 IST)
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. పీఆర్సీ నివేదికపై చర్చించి ఆమోదం తెలిపారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో పీఆర్సీ పై సీఎం ఓ ప్రకటన చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 
 
అలాగే మార్కెట్ కమిటీ ఉద్యోగులు, పెన్షనర్లకు 010 పద్దు కింద జీతాలు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవలే తిరుపతి పర్యటనలో సీఎం వైఎస్ జగన్ పీఆర్సీపై కీలక ప్రకటన చేశారని వెల్లడించారు. 
 
అయితే అది పట్టించుకోకుండా కొన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయన్నారు. ప్రభుత్వాధినేత ప్రకటించిన నిర్ణయంపై వేచి చూడకుండా ఇలా వ్యవహరించడం బాధాకరమని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు