వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా... దిగువ స్థాయి ప్రజానీకంలో మత్రం యువ సీఎం క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది. ఆయన పథకాలపై ఎన్ని విమర్శలు చేసినా, చివరికి వాటి మహత్యం ఇంకా పనిచేస్తూనే ఉందని అర్ధం అవుతోంది. ఈ రోజు ఏపీ సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో చేసిన పర్యటన సందర్భంగా ఈ విషయం రుజువయింది. అడుగడుగునా సీఎం జన్మోహన రెడ్డికి ప్రజలు స్వాగతం పలికారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆప్యాయంగా పలకరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన చేశారు. తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో వరద బాధితులను ఆయన పరామర్శించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు - పాడీపేట వద్ద స్వర్ణముఖి నదిపై వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించిన సీఎం, అక్కడ ఎలా చేయాలో అధికారులకు సూచనలు చేశారు. ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు కానిస్టేబుల్ ప్రసాద్ సహా మరో ముగ్గురు పౌరులను ముఖ్యమంత్రి అభినందించారు. నలుగురికి మెమొంటోలు అందించిన సీఎం వైయస్. జగన్ వారి తెగువకు మంత్రముగ్గులయ్యారు.
చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రహదారులు భవనాలు, వ్యవసాయం, ఉద్యానవన, గృహనిర్మాణం, విద్యుత్ శాఖలకు సంబంధించి
వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి వీధుల్లో సామాన్య ప్రజలు, వరద బాధితులను జగన్ పరామర్శించారు. చాలా మంది జగన్మోహన్ రెడ్డిని తాకి మరీ తమ అభిమానాన్ని చాటారు.