నెల్లూరు జిల్లాలో..
చికెన్, మటన్ షాపులన్నింటినీ పోలీసులు మూసివేయించారు. ఆదివారాల్లో మాంసం దుకాణాల ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇలా జనం గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
దీంతో జిల్లాలోని అన్ని చికెన్, మటన్ షాపలను మూసివేయించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72కు చేరింది. రెడ్‌జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో పోలీసులు నిబంధనలను కఠినతరం చేశారు.