విజయవాడలో ఏం జరుగుతోంది?..తలలు పట్టుకుంటున్న అధికారులు!

సోమవారం, 20 ఏప్రియల్ 2020 (08:57 IST)
విజయవాడ నగరంలో పాజిటివ్‌ కేసులు ఎలా పెరుగుతున్నాయో అర్థంగాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా నమోదైన కేసులను పరిశీలిస్తే కరోనా వైరస్‌ ఎలా విస్తరించిందనే విషయం తెలియడంలేదు. 
 
ఇటీవల మాచవరంలో ఓ మహిళకు పాజిటివ్‌ రాగా ఆమె ఎలా సోకిందనే దానిపై ఇంకాస్పష్టత రాలేదు. అధికారులు పలుమార్లు ఆరా తీస్తే ఒకసారి స్టోర్‌కు వెళ్లానని, మరోసారి కూరగాయలకు తప్ప బయటకు వెళ్లలేదని ఆ మహిళ అధికారులకు సమాధానం ఇచ్చింది.

ఇదే మహిళ కుటుంబ సభ్యులకు ఆరుగురికి తాజాగా పాజిటివ్‌ రావడం చర్చానీయాంశమైంది. పొంతన లేని కేసులు రావడతో నగరంలో కరోనా విస్తరణ మూడో దశలో ఉందా అన్న సందేహం వ్యక్తం అవుతోంది.
 
విజయవాడ నగరంలో పాజిటివ్‌ కేసులు ఎలా పెరుగుతున్నాయో అర్థంగాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా నమోదైన కేసులను పరిశీలిస్తే కరోనా వైరస్‌ ఎలా విస్తరించిందనే విషయం తెలియడంలేదు. పొంతన లేని కేసులు రావడతో నగరంలో కరోనా విస్తరణ మూడో దశలో ఉందా అన్న సందేహం వ్యక్తం అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు