తిరుమల కొండపై వున్న నందకం అతిథి గృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన దంపతులు శ్రీనివాసులు నాయుడు, అరుణలు నందకం అతిథి గృహంలోని 203 గదిని తీసుకున్నారు. గురువారం గదిని తీసుకున్న వీరిద్దరూ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానంతో సిబ్బంది కిటికీలు తెరిచి చూసారు.