ఏలూరులో బైకుపై వెళ్తుండగా పేలిన దీపావళి ఉల్లిగడ్డ బాంబులు, ఒకరి మృతి (video)

ఐవీఆర్

గురువారం, 31 అక్టోబరు 2024 (15:49 IST)
దీపావళి బాణసంచాతో ఎంతో జాగ్రత్తగా వుండాలి. ఏమాత్రం ఏమరపాటుగా వుంటే బాణసంచా ప్రాణాల మీదికి తెస్తాయి. ఏలూరులో ఉల్లిగడ్డ బాంబులు పేలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. బైక్‌ పైన ఉల్లిగడ్డ బాంబులను ఓ మూటలో వేసుకుని తీసుకెళ్తుండగా పేలిపోయాయి. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
 
ఏలూరు తూర్పువీధి గౌరమ్మ గుడి వద్ద ఓ బైక్‌పై ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళుతున్నారు. ఐతే బైకు బ్యాలెన్స్ తప్పి అది కాస్త గోతిలో పడింది. ఉల్లిగడ్డ బాంబులు బలంగా నేలను తాకితే పేలిపోతాయి. ఈ క్రమంలో బైకు బలంగా నేలకి గుద్దుకోవడంతో మూటలో వున్న ఉల్లిగడ్డ బాంబులు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. తీవ్ర గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

బైక్‌పై తీసుకెళ్తుండగా పేలిన ఉల్లిగడ్డ బాంబులు.. ఓ మహిళ మృతి

ఏలూరు తూర్పువీధి గౌరమ్మ గుడి వద్ద ఓ బైక్‌పై ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళుతుండగా.. బైక్ గోతిలో పడి బాంబులు పేలాయి.

ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. మరి కొందరికి గాయాలయ్యాయి. pic.twitter.com/tZBMIrtNzb

— Telugu Scribe (@TeluguScribe) October 31, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు