యువకుడికి కనెక్ట్ అయిన ధనవంతులైన తల్లీకూతుళ్లు, అతడే మృత్యువయ్యాడు

బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (23:13 IST)
ఇంట్లో మగ దిక్కు లేదు. తల్లికి భర్త లేడు. కూతురి భర్త కూడా చనిపోయాడు. అయితే  పిల్లలను పెట్టుకుని ఇద్దరూ ఒకే చోట ఉండేవారు. ఆస్తిపరులు కావడంతో ఏ పని చేయకుండా ఉండేవారు. ఐతే తల్లీకూతుళ్ళకు ఒక యువకుడికి కనెక్ట్ అయ్యాడు. ఐతే అతడే వారి పాలిట మృత్యువుగా మారాడు. అనుమానంతో తల్లీకూతుళ్లనిద్దరినీ చంపేసి పారిపోయాడు.
 
చిత్తూరు జిల్లా తంబళ్ళలప్లి మండలం గంగిరెడ్డిపల్లె పంచాయతీ ఏటిగడ్డ తాండాకు చెందిన గంగులమ్మ భర్త అనారోగ్యంతో ఐదు సంవత్సరాల క్రితం చనిపోయాడు. గంగులమ్మ ఆస్తిపరురాలు. ఒక్కటే కూతురు సరళ. ఆమెకు వివాహం చేశారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 
అయితే భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సరళ పుట్టింటికి వచ్చేసింది. ఆమె వయస్సు నలభై యేళ్ళు. తల్లీకూతుళ్ళు ఇద్దరితో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు చిన్న వారు. అయితే ఆస్తి ఉన్నా శారీరక సుఖం ఏమాత్రం లేదన్న భావన వారిద్దరిలో కలిగింది.
 
దీంతో తమకు సమీప బంధువు మౌలాలితో వీరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ సంబంధం కాస్త గత నాలుగు నెలలుగా సాగుతోంది. శారీరక సుఖమే కాదు వారి దగ్గర తన అవసరాల కోసం డబ్బులు తీసుకుని జల్సా చేసేవాడు. ఇది ఇలాగే సాగుతుంటే వారిద్దరు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు మౌలాలికి అనుమానం వచ్చింది.
 
వారిద్దరిని నిలదీశాడు. అయితే అదంతా ఏమీ లేదని ఇద్దరూ చెప్పారు. అయినా మౌలాలి నమ్మలేదు. సరిగ్గా వారంరోజుల క్రితం ఇద్దరినీ ఊరి చివరికి రమ్మని పిలిచాడు. ముందు సరళతో మాట్లాడుతూనే ఆమె తలపై గట్టిగా బాదాడు. స్పృ తప్పి పడిపోయిన తరువాత ఆమెను పాడుపడిన బావిలో పడేశాడు. ఆ తరువాత గంగులమ్మను అలాగే చేశాడు. 
 
కానీ వీరి మృతదేహాలకు తాళ్ళను కట్టి బావిలోకి తోసేయడంతో బాడీలు పైకి రాలేదు. ఎక్కడ బయటపడిపోతుందేమోనన్న భయంతో వారిద్దరికి కరోనా.. బెంగుళూరుకు వెళ్ళారు. ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. డిశ్చార్జ్ చేయడానికి 15 రోజుల పైగా పడుతుందని బంధువులకు చెప్పాడు.
 
ఆ తరువాత ముగ్గురు పిల్లలను బెంగుళూరుకు తీసుకెళుతున్నట్లు చెప్పి అక్కడికే తీసుకెళ్ళి ఒక ఇంటిలో ఉంచాడు. రెండు రోజుల తరువాత ఊరికి వచ్చి బావిలో తొంగిచూశాడు. బాడీలు బయటకు రాలేదు. దీంతో ఊపిరి పీల్చుకుని మళ్ళీ బెంగుళూరుకు వెళ్ళాడు. కానీ నిన్న మధ్యాహ్నం బావిలో మృతదేహాలు తేలియాడాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
 
మౌలాలిపై అనుమానం ఉందని బంధువులు చెప్పడంతో ప్రత్యేక టీం బెంగుళూరుకు వెళ్ళి నిందితుడిని అదుపులోకి తీసుకుని తంబళ్ళపల్లికి తీసుకొచ్చారు. అవ్వ, అమ్మ ఇద్దరూ చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు