బస్సు స్టెప్నీ టైరుపై పడుకుని 20 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తాగుబోతు!! (Video)

ఠాగూర్

ఆదివారం, 16 మార్చి 2025 (10:08 IST)
ఓ తాగుబోతు పెను ప్రాణాపాయం నుంచి తప్పిచుకున్నాడు. బస్సు వెనుక కింద భాగాన ఉన్న స్టెప్నీ టైరుపై పడుకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం అందిరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్త చెరువు నుంచి హిందూపురానికి ఆర్టీసీ బస్సు ఒకటి బయలుదేరింది. పెనుకొండ సమీపంలోని రాంపురం వద్ద బస్సు వెళుతుండగా బస్సు కింది భాగంలో కాళ్లు వేలాడుతుండటాన్ని ద్విచక్రవాహనంపై వెళుతున్న వాహనదారులు గమనించి డ్రైవర్‌కు చెప్పారు. 
 
ఆ వెంటనే బస్సును పక్కన ఆపిన డ్రైవర్ చిరంజీవి రెడ్డి స్టెప్నీ భాగంలో చూడగా, మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్టెప్నీ టైర్‌మీద నుంచి కిందకు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతని వివరాలను ఆరా తీయగా చెప్పలేదు. దీంతో దండించి పంపించి వేశారు. అయితే, ఈ ఘటనలో అతనికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో డ్రైవర్, కండక్టర్‌, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

 

కొత్తచెరువు నుంచి హిందూపురం వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు వింత ప్రయాణం????????

బస్సు వెనుక స్పేర్ టైర్ ఎక్కి పడుకున్న మందుబాబు, 15 కిలోమీటర్లు ప్రయాణం , వాహనదారులు గమనించి డ్రైవర్ కు చెప్పటం తో బస్సు ఆపి చూడగా.... మందుబాబు పడుకుని ఉన్నాడు ..ఖంగుతిన్న ఆర్టీసీ డ్రైవర్ ????‍♂️????‍♂️ pic.twitter.com/yjNKkRX8np

— Bhaskar Reddy (@chicagobachi) March 15, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు