అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. కర్ణాటకలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయేల్ నుంచి కర్ణాటకకు వచ్చిన టూరిస్ట్ యువతి.. ఒక హోమ్ స్టే ఓనర్ ఇంట్లో దిగింది. వీరంతా గురువారం రాత్రి.. తుంగభద్ర కెనాల్‌ను చూసేందుకు వెళ్లారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కాగా.. మరో ముగ్గురు మగవాళ్లు. ఇంతలో కొంత మంది రాత్రి పూట వీళ్ల దగ్గరకు రెండు బైక్‌ల మీద వచ్చారు.
పెట్రోల్ కావాలని మొదట వచ్చారు. ఆతర్వాత డబ్బులు డిమాండ్ చేశారు.నఇవ్వకుండా నిరాకరించడంతో పురుషుల్ని తుంగభద్రకేనాల్‌లో తోసేశారు. యువతులు ఇద్దరి మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.అయితే.. ముగ్గురు యువకుల్లో ఇద్దరి ఆచూకీ లభించింది. మరోక వ్యక్తి జాడ దొరకలేదు.ఈ ఘటన ప్రస్తుతం కన్నడ నాటు దుమారంగా మారింది.
అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్ర పర్యాటకుడు పంకజ్‌లు కాలువ నుంచి ప్రాణాలతో బయటకు వచ్చారు. అయితే ఒడిశాకు చెందిన బిబాష్ అనే వ్యక్తి ఆచూకీ లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అత్యాచారానికి గురైన మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుల్ని గుర్తించామని, పట్టుకునేందుకు రెండు స్పెషల్ టీమ్స్ దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.