అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో భూకంపం వచ్చిందంటూ తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... 66 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందనీ, పదేళ్లపాటు రాజకీయ జీవితం లేకుండా అయిందన్నారు.