ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసులు అనే వ్యాపారి వద్దకు 2017లో కొందరు వ్యక్తులు వచ్చి గుప్తనిధులు ఇప్పిస్తామని నమ్మబలికారు. కొత్తపల్లి మండలంలోని ఓ పొలంలో నిధిని బయటకు తీసేందుకు పూజలు చేయాల్సి ఉందని, అందుకు కొంత సొమ్ము ఖర్చవుతోందని చెప్పారు.