రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా గురించి తెలియనివారు ఎవరుంటారు. సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసారు. ఈ క్రమంలో ఆమె జీవితంపై ఓ పుస్తకం విడుదల చేసారు.
రంగుల ప్రపంచం నుండి రాజకీయాల్లోకి అనే పేరుతో రోజా జీవిత చరిత్రపై వైసిపి నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు చేతులు మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం విడుదల సందర్భంగా పలువురు నాయకులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇకపోతే.. ఈ పుస్తకం ఆధారంగా చేసుకుని రోజా బయోపిక్ ఎవరైనా తీసేందుకు ప్లాన్ చేస్తారేమో చూడాలి.
మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల
“ రంగుల ప్రపంచం నుండి రాజీకీయాల్లోకి “ అనే పేరు రోజా జీవిత చరిత్రపై పుస్తకం విడుదల చేసిన అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి. pic.twitter.com/Ph9saUK0LI