అంబటి రాంబాబు 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోతారు, ఆయన్ని మార్చేయండి: వైసిపి అధిష్టానానికి నాయకులు

ఐవీఆర్

బుధవారం, 13 మార్చి 2024 (12:31 IST)
మంత్రి అంబటి రాంబాబుకి సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగులుతోంది. ఈసారి సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతారనీ, కనీసంలో కనీసం 25 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలవుతారని సొంత పార్టీ నాయకులే లెక్కలు కట్టి మరీ వైసిపి అధిష్టానానికి నివేదికలు పంపినట్లు సమాచారం.
 
ముఖ్యంగా ఇటీవల అంబటి రాంబాబు గ్రాఫ్ నియోజకవర్గంలో దారుణంగా పడిపోయిందనీ, ఆయన పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వున్నదని నరసరావుపేట ఎంపిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వైసిపిలో ప్రతిపక్షాలతో మాటకు మాట వేసే అంబటిపై సొంత పార్టీలోనే ఇలా వ్యతిరేకత రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
పైగా సత్తెనపల్లి నుంచి తెదేపా నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. ఆయన ముందు అంబటి రాంబాబు ఎంతమాత్రం నిలబడలేడనీ, కనుక ఆయనను తక్షణమే వేరొక నియోజకవర్గానికి మార్చి, గెలిచేవారిని సత్తెనపల్లిలో అభ్యర్థిగా దించాలని పట్టుబడుతున్నారు. మరి వైసిపి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి వుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు