ఓట్లు అడిగేందుకు వస్తే చెప్పుతో కొడతాం... : మంత్రి అంబటికి షాక్

ఠాగూర్

శుక్రవారం, 5 జనవరి 2024 (15:19 IST)
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఓట్లు అడిగేందుకు వస్తే చెప్పుతో కొడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ళలో మంత్రి అంబటి రాంబాబుకు ఈ షాక్ తగిలింది. బుధవారంనాడు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మన్సూర్ వలి మృతదేహాన్ని చూసేందుకు మంత్రి అంబటి రాంబాబు గురువారం గ్రామానికి వచ్చారు. అయితే చనిపోయిన సమయంలో రాకుండా... ఇప్పుడెందుకు వచ్చావంటూ మంత్రిపై బాధితులు మండిపడ్డారు.
 
'మేము వైసీసీ సానుభూతిపరులం. మాకే ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు?. మేం ఓట్లేస్తేనే గెలిచావు. ఈసారి ఓట్ల కోసం వస్తే చెప్పుతో కొడతాం' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోని ఈ సంఘటనతో అవాక్కయిన మంత్రి అంబటి.. ఏమీ మాట్లాడకుండా.. మన్సూర్ వలి మృతదేహానికి పూలమాల వేసి వెళ్లి పోయారు. కాగా గ్రామంలో కూరగాయల వ్యాపారం చేసుకునే షేక్ మన్సూ రవలి బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటనకు కారణమైన వాహన డ్రైవర్ను బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి, పంపేయడంతో ముస్లింలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. 
 
సంక్రాంతికి 4500 ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడ? 
 
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 4500 ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ బస్సులను రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలకు నడుపనుంది. ఈ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రత్యేక సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి సౌకార్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 
 
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీ నగర్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ తదితర రద్దీ ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బస్ భవన్, ఎంజీబీఎస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ల నుంచి రద్ద ప్రాంతాల్లోని పరిస్థితులను ఎప్పటికపుడు పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికులు త్వరగా తమ గమ్య స్థానాలకు చేరుకునేలా టోల్ ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్లను కూడా ఏర్పాటు చేస్తామని సజ్జనార్ తెలిపారు. అధిక చార్జీలను చెల్లించి ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించవద్దని, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు