సంస్థను విజయపథంలో నడిపేందుకు లేఆఫ్స్ తప్పదు : సుందర్ పిచాయ్

ఆదివారం, 17 డిశెంబరు 2023 (10:40 IST)
ఒక సంస్థను విజయపథంలో నడిపేందుకు అవసరమైనపుడు లేఆఫ్స్ తప్పదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఒక యేడాది క్రితం దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగించినట్టు వెల్లడించారు. తొలగింపులు వాయిదావేసివుంటే కీలక రంగాల్లో పెట్టుబడులకు ఆటంకాలు ఏర్పడేవని ఆయన తెలిపారు. లేఆఫ్స్‌తో ఉద్యోగుల నైతికస్థైర్యం దెబ్బతిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
గూగుల్ సంస్థలో చేపట్టి లేఆఫ్స్‌పై ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా స్పందించారు. అప్పట్లో లేఆఫ్స్ తప్పలేదని వెల్లడించారు. కంపెనీలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడాది క్రితం గూగుల్ ఏకంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు గుర్తు చేశారు. అప్పట్లో జాబ్స్ కోల్పోయిన వారి వాటా సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతం.
 
ఆర్థికవ్యవస్థలో మార్పుల కారణంగా లేఆఫ్స్ తప్పలేదని సుందర్ పిచాయ్ మీటింగ్‌లో వెల్లడించారు. మారుతున్న అర్థిక పరిస్థితులను తట్టుకుంటూ సంస్థను అభివృద్ధి పథంలో నడిపేందుకు లేఆఫ్స్ అనివార్యంగా మారాయని చెప్పారు. ఉద్యోగుల తొలగింపులు వాయిదా వేసుకుని ఉంటే కీలక రంగాల్లో కంపెనీ పెట్టుబడులకు ఆటంకాలు ఏర్పడేవని ఆయన తెలిపారు. 
 
అయితే, లేఆఫ్స్ తర్వాత సంస్థలో మిగిలున్న ఉద్యోగుల మానసిక స్థైర్యం తగ్గిన విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు. లేఆఫ్స్ జరిగిన తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలగింపులు మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సిందని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు