సింగరేణికి చెందిన సంగీత్ రావు అనే వ్యక్తి కాలు చిటికెన వేలుకు ఆపరేషన్ చేయించుకోవడానికి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. శనివారం నాడు అంటే.. మార్చి 23వ తేదీన ఆసుపత్రి వైద్యులు ఆయన కాలి చిటికెన వేలుకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత బాగున్న వ్యక్తి మరునాడు ఉదయాన్నే చనిపోయిన్నట్లు సమాచారం అందింది.
ఆదివారం రోజున మృతుని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆపరేషన్ ముందురోజు ఐసీయూలో వైద్యులు హంగామా చేసినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులను ఎందుకిలా చేశారని అడగగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాంతో వారు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.