ఆత్మహత్య చేసుకుంటా, అనుమతివ్వండి: సింగరాయకొండ రోడ్డుపై మహిళ, ఎందుకు? (video)

ఐవీఆర్

సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (17:06 IST)
ప్రకాశం జిల్లా సింగరాయకొండ నడిరోడ్డుపై ఓ మహిళ ఆందోళనకు దిగింది. తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను అభ్యర్థిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే...
 
ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ ఓ స్థలం కొనుగోలు చేసారట. ఆ స్థలంలో ఇల్లు నిర్మిస్తుంటే కొందరు రౌడీలు వచ్చి దాన్ని గడ్డపారలతో ధ్వంసం చేసారని ఆరోపిస్తోంది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదనీ, అందువల్ల తనకు చావే శరణ్యమంటూ నడిరోడ్డుపై ఆమె నిరసనకు దిగింది. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించింది.

ఆత్మహత్యకు అనుమతి ఇవ్వండి - నడిరోడ్డుపై మహిళ నిరసన

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా దాడులు‼️

రౌడీలని పంపించి ఇంటిని గడ్డపారలతో ధ్వంసం చేశారని.. పోలీసులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని చావే శరణ్యమని అన్నారు pic.twitter.com/yHhRUy9wmK

— Bhaskar Reddy (@chicagobachi) February 3, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు