హిందూ దేవాలయాలంటే జగన్ కు నచ్చదు: మాజీ మంత్రి జవహర్

ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:55 IST)
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా దాడులు దళితుల మీద, దేవుళ్లలో హిందూ దేవాలయాలపై దాడుల జరుగుతున్నాయని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ విమర్శించారు. జగన్ కు మనుషుల్లో నచ్చని వాళ్లు దళితులు, దేవుళ్లలో నచ్చని దేవుళ్లు హిందూ దేవుళ్లని అన్నారు.

సాక్ష్యాత్తు సోనియా గాంధీ కూడా మత విశ్వాసాలను గౌరవిస్తానని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దేవాలయంలోకి ప్రవేశించారని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా  డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దేవాలయంలోకి ప్రవేశించారని అన్నారు. 

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితిలేదని అంటున్నారని, రాబోయే రోజుల్లో సంప్రోక్షణ, బ్రహ్మోత్సవాలు, దర్శనాలు, దేవుడికి ఏదీ లేకుండా చేసే పరిస్థతి వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిందని పేర్కొన్నారు.

భారతదేశం లౌకిక రాజ్యం అని, ఇందులో అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలు గౌరవించాలని, కానీ వాటిని  జగన్ అన్నీ పక్కన బెట్టారని మండిపడ్డారు. కేవలం స్వరూపానంద కాళ్లు నొక్కితే జగన్ కు స్వర్గం వస్తుందని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

గంగలో మునిగితే హిందూభావం వస్తుందనుకుంటే పొరపాటేనని, ప్రజల మనోభావాలు గౌరవించలేని ముఖ్యమంత్రి రాజీనామా చేసి  ప్రశాంతంగా జైల్లో కూర్చుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు.  కనకదుర్గమ్మ గుళ్లో వెండి సింహాలు మాయం, అంతర్వేదిలో రధం దగ్ధం కావడం జగన్ రెడ్డి అలసత్వానికి నిదర్శనమని ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు