'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

ఠాగూర్

సోమవారం, 14 ఏప్రియల్ 2025 (19:03 IST)
లౌక్య ఎంటర్‌టైన్మెంట్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రం "దండోరా". ఈ చిత్రంలో బిందు మాధవి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనున్నారు. ఎమోషనల్ టచ్‌తో ఉంటూ ఆలోచింప చేసేలా ఆమె పాత్ర ఉంటుందని మేకర్స్ అంటున్నారు. 
 
ఫస్ట్ బీట్ వీడియోతో అంచనాలు పెంచుకున్న 'దండోరా' సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది. అగ్ర వర్గాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండలు జరుగుతాయన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం అని దర్శకుడు మురళీకాంత్ అంటున్నారు. 
 
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు