అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తలా తోకా లేవని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ మహిళా కార్యకర్త సుభాషిణి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు తిరుపతికి చెందిన సుభాషిణి అనే మహిళా కార్యకర్త, రోజాను తీవ్రంగా విమర్శిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రోజా తనకు సోదరి వంటిదని సుభాషిణి తెలిపారు. రోజా అన్ పార్లమెంటరీ భాషను వాడుతున్నారని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తాను తలాతోకా లేని పార్టీలో చేరబోనని జనసేనను ఉద్దేశించి రోజా చెప్పడాన్ని గుర్తు చేస్తూ, "మీరు సూపర్ అక్కా. మీరు కరెక్ట్ గానే మాట్లాడారు.