వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రారంభం రోజే 9 మంది ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపిగా బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
అలాగే కమెడియన్ అలీని రాజమండ్రి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, శివాజీ, శివబాలాజీకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్‌కు ఎంపి సీటు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. జంప్ జిలానీలకు అవకాశం లేదని పవన్ ముందు నుంచే చెబుతున్నారు.