అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న తరహాలో నిధులు ఇస్తే మరో 50 యేళ్ళ వరకు రాజధాని నిర్మాణం పూర్తికాదని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అని.. అక్కడి మౌలిక సదుపాయాలు, రహదారులు ఇలా అన్నింటికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఇలాగే ఆలస్యం చేసుకుంటూ పోతే రాజధాని నిర్మాణానికి మరో 50 ఏళ్ల సమయం పడుతుందన్నారు.