ప్రభుత్వ కార్యాలయాల్లో పక్కాగా పౌర సేవలు అందడం, విద్యావ్యవస్థను మెరుగుపరచడం, పేదవాడి జేబు నుంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, నేరం చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష, తమ పనులు చేసుకునే అధికారం ప్రజలకే అప్పజెప్పడం, వ్యవసాయంలో ఆదాయం పెంచడం వీటి కోసమే తాను సురాజ్య యాత్ర చేపట్టినట్లు జయప్రకాష్ నారాయణన్ చెప్పారు. సమాజంలో మార్పు కోసమే తాను 45 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు జయప్రకాష్ నారాయణన్ చెప్పారు.