తూర్పుమధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి దక్షిణ మధ్య కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది.
దీని ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 2 రోజులూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు.. కర్నూలులో 35.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది