Prakash Raj: ఎవరైనా దీన్ని పవన్ కళ్యాణ్‌కి వివరించగలరా?: హిందీపై ప్రకాష్ రాజ్

సెల్వి

శనివారం, 15 మార్చి 2025 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీని రుద్దుతోందని ఆరోపణలపై తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో ఆయన ఈ స్పందన వ్యక్తం చేశారు.
 
"మీ హిందీని మాపై రుద్దకండి" అని చెప్పడం అంటే మరొక భాషను ద్వేషించడం లాంటిది కాదు అని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇది మన మాతృభాషను, మన సాంస్కృతిక గుర్తింపును గర్వంగా రక్షించుకోవడం గురించే ఇదంతా.. దయచేసి ఎవరైనా దీన్ని పవన్ కళ్యాణ్‌కి వివరించగలరా? అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 
 
జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పవన్ ఈ కళ్యాణ్ ప్రసంగానికి ప్రతిస్పందనగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, ముఖ్యంగా తమిళనాడులో హిందీ రుద్దడంపై వివాదం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు