ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా 326 దివ్యాంగుల ఉద్యోగాల భర్తీ: డాక్టర్ కృతికా శుక్లా

మంగళవారం, 16 మార్చి 2021 (15:08 IST)
విభిన్న ప్రతిభావంతుల కోసం రిజర్వ్ చేయబడి, వివిధ జిల్లాలలో ప్రస్తుతం ఖాళిగా ఉన్న 326 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు విభిన్న ప్రతిభావంతులు, లింగ మార్పడి, వయోవృద్దుల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఆయా జిల్లా కలెక్టర్లు నియామక ప్రక్రియలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసారని, ఎంఎల్సి ఎన్నికల దృష్య్టా కొన్ని జిల్లాలలో బుధవారం తరువాత నోటిఫికేషన్ జారీ చేస్తారని వివరించారు.
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దివ్యాంగుల సమస్యల పట్ల సానుకూల ధోరణితో ఉన్నారని, సిఎం ఆదేశాల మేరకే జిల్లాల వారిగా జిల్లా పాలనాధికారుల నేతృత్వంలో ఈ ప్రత్యేక నియామక ప్రక్రియను చేపట్టామని స్పష్టం చేసారు. జిల్లాల వారిగా శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 4, విశాఖపట్నంలో 21, తూర్పు గోదావరిలో 62, పశ్చిమ గోదావరిలో 6, కృష్ణాలో 41, గుంటూరులో 31, ప్రకాశంలో 34, నెల్లూరులో 29, చిత్తూరులో 20, వైఎస్ఆర్ కడపలో 24, కర్నూలులో 24, అనంతపురంలో 23 పోస్టులు ఉన్నాయన్నారు.
 
వీటిలో నాలుగో తరగతి ఉద్యోగులు, గుమస్తాలు, టైపిస్టులు, షరాఫ్ తదితర ఉద్యోగాలు ఉన్నాయని, ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్లు అన్ని వివరాలతో నోటిఫికేషన్ ఇచ్చారని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఎన్నికల కోడ్ నేపధ్యంలో 17వ తేదీ తరువాత నోటిఫికేషన్ ఇస్తారని వివరించారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉందని స్పష్టం చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు