వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా పథకాలకు స్కోచ్‌ అవార్డులు

మంగళవారం, 18 జనవరి 2022 (16:49 IST)
వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా పథకాలకు స్కోచ్‌ అవార్డులు వొచ్చాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబరంగా తెలిపారు. తమ ఆనందాన్ని అయన ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పంచుకున్నారు. 
 
 
క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్‌ సీఈఓ ఇంతియాజ్‌ అహ్మద్‌ అవార్డులను ఆయనకు చూపించారు.
 
 
గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాల ద్వారా పేదల సుస్ధిరాభివృద్ధి కోసం సెర్ప్‌(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ) చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ, స్కోచ్‌ అందించిన గోల్డ్‌ అవార్డులను సీఎంకు సెర్ప్ సీఈఓ ఇంతియాజ్‌ అహ్మద్.చూపించారు.  గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి,  సెర్ప్ సీఈఓలను సీఎం వైయస్‌.జగన్‌.అభినందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు