ఆలయ అర్చకులు, వేదపండితులు సేవా కార్యక్రమాలు, పూజాధికాలను శాస్త్రోక్తకంగా నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా పవిత్ర సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు.
ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శాకంభరీ దేవి ఉత్సవాల సందర్భముగా అమ్మవారు వివిధ కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరింపబడి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
దేవస్థానం నందు గర్భాలయం, అంతరాలయం, ప్రధానాలయం పరిసరాలను వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా భక్తులందరికీ కదంబం ప్రసాదంగా అందజేశారు. శాకాంబరి దేవి ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి.