తనకోర్కె తీర్చాలంటూ పలు ఇబ్బందులకు గురిచేశాడు. అతని వేధింపులు ఒకపక్క, అప్పులు మరోపక్క పద్మాను కుదిపేసాయి.. చిన్న కొడుకుని తీసుకొని బెంగుళూరు ఫ్యాక్టరీ లో కూలి పనికిచేరి రాష్ట్రం గాని రాష్టంలో రాని భాషతో అష్టకష్టాలు పడి కూతుళ్ళ పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చుకుతున్న సమయంలో కరోనా ఆమెను అక్కడి నుండి వెళ్లగొట్టింది.
నేరుగా ఊరి చేరిన ఆమెను అల్లుడు యముడుడై వేధింపులు మరలా ప్రారంభించాడు ఒక పక్క కూతురు కాపురం చెడుతుందనే బాధతో మరోపక్క బయట చెప్పుకుంటే పరువు పోతుందని ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతూ ఉన్న తరుణంలో ఈరోజు నేరుగా అల్లుడు తీరు శృతి మించి అలాగే అత్త పై దాడి చేసి అడ్డు వచ్చిన భార్య మరదలు పై దాడికి పాల్పడ్డ సంఘటన ఆత్మకూరు చోటుచేసుకుంది.