చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని ఓబీఆర్‌కండ్రిగ పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. 1269 మంది ఓటర్లున్న పంచాయతీలో ఓబీఆర్‌కండ్రిగ, రామరాజుకండ్రిగ, పాపరాజుకండ్రిగతోపాటు రెండు ఎస్సీకాలనీలు, ఓ ఎస్టీ కాలనీ ఉంది.
పంచాయతీలో క్షత్రియులు, యాదవులు, ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్నారు. దీంతో అత్తాకోడళ్లు అన్ని సామాజికవర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగారు. అయితే ముక్కోణపు పోటీ ఉన్నా, అత్తాకోడళ్ల నడుమ ప్రధాన పోటీ నెలకొందని స్థానిక ఓటర్లు అంటున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన మహిళలు ఎన్నికల బరిలో నిలవడంతో ఓటర్ల అయోమయానికి గురవుతున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు తమ మద్దతుదారు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆయకట్టుకునే యత్నం చేస్తున్నారు. ఈ రసవత్తర పోరులో అత్తాకోడళ్లలో ఎవరికి పైచేయి అవుతుందో?!